Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు
నవతెలంగాణ-మోమిన్‌పేట
దసరాలోపు కార్తికేయ కంపెనీ ఎంప్లాయిస్ వేతన ఒప్పందం అమలుకు యాజమాన్యం సానుకూలంగా స్పం దించారని టీఆర్ఎస్ కేవీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్ అన్నారు. శనివారం కార్తికేయ కార్మి కులతో యాజమాన్యాలతో కలిసి కార్మికుల వేతనాల గురిం చి మాట్లాడామని తెలిపారు. ప్రతి మూడేండ్లకోసారి వేతన ఒప్పందాలను గురించి చర్చించుకుంటున్నామని కార్మి కులను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు సరైన వేతనాలను అమలు చేసేందుకు యాజమాన్యాలను ఒప్పించామన్నా రు. అందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించి దసరాలోపు వేతన ఒప్పందం అమలకు శ్రీకారం చుడతా మన్నారు. కార్యక్రమంలో టీఆర్ కెవి రాష్ట్ర ప్రధానకార్య దర్శి నారాయణ యాదవ్, టిఆర్ఎస్ కే వి జిల్లా అధ్యక్షులు టైగర్ బి కృష్ణయ్య యూనియన్ ప్రధాన కార్యదర్శి కే రాములు, ఉపాధ్యక్షులు ఓ శ్రీనివాస్, ఏ రాములు, దేవ రాజ్, నగేష్, విక్రంరెడ్డి, లక్ష్మణ్, మైపాల్, కంపెనీ కార్మి కులు తదితరులు పాల్గొన్నారు.