Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంప్లాయిస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య
- తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన జిల్లా మహాసభలు
నవతెలంగాణ-ఆమనగల్
పంచాయతీ కార్మికులకు రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఎంప్లాయిస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభలు తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్లో శనివారం ప్రారంభమయ్యాయి. మహాసభలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి దాదాపు 200 మంది ప్రతిని ధులుగా హాజరయ్యారు. మహా సభలకు ముఖ్య అతిథులు గా గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య హాజరై మాట్లాడారు. 2019 మే నెలలో రెండవ మహాసభల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పెంచుతామన్న వేతనాల కోసం జీవో నెంబర్ 51 విడుదల చేసిందన్నారు. దీని ప్రకారం రూ.8,500 జీతం ఇస్తున్నట్టు ప్రకటించి కూడా కార్మికులకు ఇప్పటివరకు కూడా పూర్తి జీతం ఇవ్వలేన టువంటి పరిస్థితి ఉన్నందున జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా కార్మికులకు రూ.15,600 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా కారోబార్ బిల్ కలెక్టర్లకు రూ.19,500 కంప్యూటర్ ఆపరేటర్‌తో పాటు ఇతర పరిపాలన విభాగాలలో పని చేస్తున్న వారికి రూ.22,950 వేతనం ఇవ్వాలని డిమాండ్స్‌తో రాబోయే కాలంలో పోరాటం నిర్వహిస్తామని చెప్పారు. గ్రామపంచా యతీ కార్మికులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కారోబార్ బిల్ కలెక్టర్‌కు ప్రత్యేక హౌదా కల్పించాలని ఈ మహాసభ తీర్మానించిందని తెలిపారు. కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో రంగారెడ్డి జిల్లాలో పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేస్తామని ఈమహాసభ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలు మాధవి, జిల్లా కార్యదర్శి రత్నం, జిల్లా అధ్యక్షులు పాండు, సీఐటియూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, కోశాధికారి మల్లేష్, జిల్లా నాయకులు సాయిబాబు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య, బుగ్గ రాములు, శేఖర్, దేవేందర్, మండల కో-కన్వీనర్ రవణీల, మండల అధ్యక్షురాలు యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.