Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట్రాములు
- వికారాబాద్లో సాయుధ పోరాట వారోత్సవాలు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
దేశాన్ని లూటీ చేస్తూ మత ఉత్మోన్మాదాన్ని పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెబుతారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి పి. మల్లేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు హాజరై మాట్లాడారు.. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు ఆరేండ్లు సాగిందన్నారు. ఈ పోరాటంలో కులాలకు, మతాలకు తావు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రా ళ్లు, తుపాకులు బంధుకులు గుత్పాలు, రోకలి బండలు చేత పట్టుకొని భూమికోసం, భుక్తి కోసం, వెట్టు చాకిరి విముక్తి కోసం పోరాటం చేశారని అన్నారు. 4వేల మంది అమరులైయ్యారని గుర్తు చేశారు. 3వేల గ్రామాలు దొరల నుంచి విముక్తి చెందాయని తెలిపారు. లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందన్నారు. సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధం లేదన్నారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందన్నారు. కమ్యూనిస్టులతోనే తెలంగాణకు విముక్తి కల్గిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్.మహిపాల్, వెంక టయ్య, బుస చంద్రయ్య, శ్రీనివాసు, బుగ్గప్పజి, వెంకట రాములు, సు భాష్, సుదర్శన్, సత్యనారాయణ, శేఖర్, సామయ్య, రాములు, లక్ష్మ య్య, లాలయ్య శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.