Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర నియంత పాలకులను గద్దెదించేందుకు సమయం అసన్నమైంది
- కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నిజాం నిరంకుశ, రాచరిక పాలనను తరమికొట్టిన చరిత్ర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉందని.. ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్న నియంత పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ్మారెడ్డి అన్నారు. తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శని వారం గాంధీభవన్‌లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమం సందర్భంగా జాతీయ జెండాను అవిష్కరించి.. అమరులకు నివాళులు అర్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 48 సెప్టెంబర్ 17 నైజాం సర్కార్ నిరంకుశ పాలనలో రాక్షస కాశీంరజ్వీ పైశాచిక నరమేధ క్రీడల నుంచి అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభా రు పటేల్ చొరవతో విముక్తి పొంది భారత యూని యన్‌లో విలీనమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పీసీసీ సెక్రెటరీ వేణుగౌడ్, టీపీసీసీ సెక్రటరీ దండం రామిరెడ్డి, శివకుమార్, రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దేవ గోని కృష్ణ, మాజీ అధికార ప్రతినిధి భీమ్ భరత్, మాజీ మహిళా అధ్యక్షురాలు సులోచనమ్మ, రంగారెడ్డి జిల్లా సేవాదళ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ కీసర యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్, విజయవర్ధన్ రెడ్డి, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మారేపల్లి రమేష్, గెల్ల సుభాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.