Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం
- 15 రోజులపాటు దేశభక్తిని చాటుకున్న జనం
- తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మారావుగౌడ్
- వికారాబాద్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భం గా వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పద్మారావుగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ శాఖ తరఫున గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజరు కుమార్, మున్సి పల్ చైర్పర్సన్ మంజుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనస భ ఉపసభాపతి పద్మారావుగౌడ్ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడానికి గల ప్రాధాన్యతను వివరిస్తూ నివేదికను చదివారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగా ణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 'చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగా ణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరి పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్స వాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహిం చనంత ఘనంగా జరుపుకున్నాం. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకు న్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెల కట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సిం హారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణ మాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దాం. జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు. ప్రజల మధ్య సమైక్యత. విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి.75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. నేడు స్వరాష్ట్రమై అన్నిరంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. ఆనాడు తెలంగాణలో సమస్త జనులు ఏక మై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగ ధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రే పాలని విచ్ఛిన్నకర శక్తులు కట్రలు చేస్తున్నాయి. ఈ దశలో మనందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పి కొడదాం. వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దాం. సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివద్ధిని ఇలాగే కొనసాగిస్తూ, జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం' అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సంస్కతిక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలను అందజేశారు.