Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ కే.శ్రావణ్ మహారాజ్
నవతెలంగాణ-మంచాల
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజాధికార స్తాపనకు దళితశక్తి ప్రోగ్రాం అడుగులు వేస్తుందని, అందులో భాగంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నాడని దళితశక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ కొండిగారి శ్రావణ్ మహారాజ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో డాక్టర్ శారదన్ మహారాజ్ పాదయాత్రకు సంఘీబావం తెలుపుతూ మండల కమిటీ అధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపన కోసం 10000 వేల కిలమీటర్ల స్వరాజ్య పాదయాత్ర మార్చి 15 2022న కల్వకుర్తి నుంచి ప్రారంభించామని ఈ రోజుకి 3500 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి అయిందన్నారు. అందుకు సంఘీభావంగా ఆరుట్ల గ్రామంలో కేక్ కట్ చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు పి.శేకర్ మహారాజ్, ప్రదీప్ మహారాజ్, బుచ్చయ్య గౌడ్, మైనార్టీ నాయకులు సలాం, జే.ఆనంద్ మహరాజ్ తదితరులు ఉన్నారు.