Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి
- కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్కయ్య
నవతెలంగాణ-తాండూరు
తాండూర్ పట్టణంలోనీ తాండూర్ జిల్లా పరిషత్ నెంబర్-1 పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్క రించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప అన్నారు. 'ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మిల్స్, సంక్షేమ హాస్టల్స్ సర్వే'లో భాగంగా సోమవారం తాండూర్ పట్టణంలోనీ తాండూర్ జిల్లా పరిషత్ నెంబర్ -1 పాఠశాలల్లో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వ ర్యంలో పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో దాదాపు 1600 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. కానీ వానిరి కనీస సౌకర్యాలైన లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టాయిలెట్, బాత్రూం విద్యార్థులకు సరిపోయినన్ని లేవన్నారు. స్కూల్ లో స్కావెంజర్ లేకపోవడంతో పాఠశాల ఆవరణలో చెత్తా చెదారంతో నిండిపోయి దుర్వాసనతో పాటు ,దోమలు విజృంభించడంతో విద్యార్థులు రోగాల బారీన పడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి భోజనంలో పురుగులు అన్నం పెడుతున్నారనీ, అందువల్ల కొందరు విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుం టున్నారని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్స్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం పంపిణీి చేసిన బియ్యం సరిగ్గా లేక, అన్నం పూర్తిగా పగిలి పోతుందని భోజన నిర్వాహకులు చెబుతున్నట్టు వెల్లడించారు.సీఎం కేసీఆర్ తన మనువడు తింటున్న సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా ర్థులకు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పడం తప్పా, ఆచరణలో అమలు చేయడంలో విఫలమ వుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాల్లో , ప్రభుత్వ హాస్టల్ల్లో చదివే ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులేనని వారిపై వివక్ష చూపించి, నాణ్యతలేని భోజనం పెట్టడం సరైంది కాదన్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ, మండల ఎంఈఓ విధులు నిర్వహిస్తున్న వారి పాఠశాలలో సమస్యలు ఈ విధంగా ఉన్నాయనీ తక్షణమే జిల్లా అధికారులు డీఈవో, జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి, సమస్యల పరిష్కారానికి కషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచి, పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలనీ కోరారు. విద్యార్థులకు అవసరమైన డైనింగ్ హాల్ వెంటనే నిర్మాణం చేయాలని, విద్య హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పనకు కృషి చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాకొక విధంగా వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాలో మెనూ ప్రకారం సక్రమంగా పాటించాలని కోరారు. హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పురుగుల అన్నం పెడుతున్నారని, ఉడకని కోడిగుడ్లు, నీళ్ల చారు పోస్తున్నారని, టైలర్స్ అసంపూర్తిగా ఉండటం మూలంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో మురుగునీరు పోవడం పారుతోందనీ,దీంతో వారు ఆటాపాటలకు దూరమవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా తరగతి గదులు సరిపోవడం లేదనీ, కనీసం కూర్చోడానికి గదులు కూడా లేవన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి, విద్యార్థులకు అవసరమైన టైల్స్ బాత్రూం, సౌకర్యాలు కల్పించాలని, తాగునీటి సౌకర్యం, ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల చివరి వరకు జిల్లావ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ల్లో సర్వేలు నిర్వహించి,నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ మంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.