Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య
నవతెలంగాణ-కొడంగల్
ఐసీడీఎస్ కింద పనిచేస్తున్న మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య అన్నారు. సోమవారం కొడంగల్‌లోని ఐసిడిఎస్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లును మెయిన్ టీచర్లుగా గుర్తించి, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయాలని అన్నారు. మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్‌ను ప్రయివేటీకరించే విధానాలను మానుకోవాలన్నారు. అంగన్వా డీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు లేక ఆయాల పని టీచర్లు చేయవలసి వస్తుందన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ పక్క భవనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మహమ్మద్, ఆంజనేయులు, నర్సింలు, వెంకటయ్య పాల్గొన్నారు.