Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంలో బుధవారం మాజీ వార్డు సభ్యుడు జంతుక అల్లాజీ లబ్దిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేశారు. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కె.పెంటమ్మ అనారోగ్యంతో బాధపడుతు ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ మేరకు ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.22,000లు మంజూరైనట్టు అల్లాజీ తెలిపారు. కార్యక్రమంలో రమేష్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.