Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ పడకంటి కవిత
- మాల్ కేంద్రంలో పోషక మాసం
నవతెలంగాణ-యాచారం
గర్భిణులు, బాలింతలు పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలని సర్పంచ్ పడకంటి కవిత అన్నారు. బుధవారం యాచారం మండల పరిధిలోని మాల్ కేంద్రంలోని అంగన్వాడీల ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నపిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టికారాన్ని చిన్నపిల్లలు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం వారికి ఎంతో ఖర్చు చేసి రోజు గుడ్డు, పాలు, పప్పు ధాన్యాలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు అందించే సూచనలు, సలహాలు గర్భిణులు పాటించే విధంగా ఉండాలని పేర్కొన్నారు. చిన్న పిల్లల తల్లులు పిల్లలను పోషకార లోపానికి గురికాకుండా ఉండే విధంగా ఆహారం అందించాలని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇస్రత్ బేగం, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.