Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీఓ వెంకయ్య
పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం
నవతెలంగాణ-శంకరపల్లి
మండలంలోని వివిధ గ్రామాలలో వందశాతం ఇంటి పనులు వసూలు చేయాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బం దితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచా యతీలలో వందశాతం పన్నులు వసూలు చేయాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. అదేవిధంగా మిగిలిపోయిన పింఛన్ కార్డులను కూడా వెరిఫికేషన్ చేయాలన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందే విధంగా చూడాల న్నారు. మండలంలో 2023- 2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాట డానికి స్థలాలు ఎంపిక చేయాలని సూచించారు. గ్రామా ల్లో ఇప్పటికే పంపిణీ చేసి మిగిలిన జాగ్రత్తగా నర్సరీలోనే కాపాడాలని సూచించారు. అదేవిధంగా తెలంగాణ గ్రామీ ణ క్రీడా ప్రాంగణాలను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీతా, ఏపీవో నాగభూషణం, గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు ఉన్నారు.