Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్
నవతెలంగాణ-ధరూర్
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా ఉండదని వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ అన్నారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో నిర్వహించిన సమావేశానికి బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అంతకుముందు టౌన్లో జెండాఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీఆర్ఎస్కు బుద్దిచెప్తారన్నారు. కార్యరకమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాధనంద్ రెడ్డి, మండల అధ్యక్షుడు రవిందర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు సూచరిత, రాష్ట్ర నాయకులు వివేకానంద రెడ్డి ,నర్వాతం రెడ్డి రమేష్, రాజేందర్ గౌడ్ జిల్లా మైనార్టీ మోర్చా, శ్రీకాంత్, సాయి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.