Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండల ఎలిమినేడు, దండుమైలారం ప్రాథమిక వైద్యశాలల పరిధిలోని ఆశా వర్కర్లకు ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం విధిగా చీరలను అందజేస్తుందని గుర్తు చేశారు. కరోనా కష్ట కాలంలోనూ ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయడం వల్ల కరోనా కట్టడి చేయగలిగామని గుర్తు చేశారు. వారి శ్రమకు ఎంత ఇచ్చిన తక్కువేనని అన్నారు. సుమారు 40 మంది ఆశా వర్కర్లకు చీరల పంపిణీ చేయడం సంతోషంగా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాపరెడ్డి, సర్పంచ్ అశోక్ వర్ధన్ రెడ్డి, డాక్టర్ అభిరామ్, డాక్టర్ పూనం, ఉప్పసర్పంచ్ నౌస్ మార్తా,గ్రామశాఖ అధ్యక్షులు నర్సింహా, వెంకటయ్య, ఐలయ్య, మరియు వైద్య సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.