Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబిసి ఛైర్మెన్ ప్రవీణ్‌రెడ్డి
నవతెలంగాణ-గండిపేట్
బిటెక్ తర్వాత విద్య ప్రమాణాల కోసం విదేశాల్లో చదువుకునే అవకాశం పొందాలని సీబిఇ ఛైర్మెన్ ప్రవీణ్‌రెడ్డి అన్నారు. గురువారం గండిపేట్ ఎంజీఐటీ ఇంజనీరింగ్ కళాశాల్లో కెరియర్ గైడెన్స్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగహాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ చంద్రమోహన్‌రెడ్డి, ఛైర్మెన్ ముఖ్యులుగా పాల్గొంటూ విద్యార్థులను ఉద్ధేశిస్తూ ప్రముఖ విదేశాలైన యుఎస్ఎ, కెనడా, ఆస్ట్రెలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్ నుండి పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంల్లో ప్రిన్సిపాల్ చంద్రమోహాన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, సీబీసీ ఛైర్మెన్ శ్రీనివాస్, సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.