Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి అరెస్టు రిమాండ్
- 71.600 కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-శంషాబాద్
గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలను శంషాబాద్ జోన్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సర్గవపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన మారుతి రాథోడ్ వత్తి రిత్యా డ్రైవర్. ఇతనిపై ఇప్పటికే పటాన్ చెరువు, వరంగల్ జిల్లాలో రెండు కేసులు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ పోలీసులు, ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్లో శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ శ్రీధర్ కుమార్ ఆదేశాలతో ఎస్సై రాజ్ కుమార్ను పెద్ద గోల్కొండ ఓ ఆర్ ఆర్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకప్ చేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలు మేరకు ఎస్సై, పోలీస్ సిబ్బంది కలిసి ఈనెల 21 న పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ఉదయం 11 గంటలకు వెహికిల్ చెకింగ్ నిర్వహించారు. అక్కడ నిందితుడు మారుతి బ్రీజా కార్లో వెహికల్ చెకప్ చేస్తే అందులో మారుతి రాథోడ్ అనే వ్యక్తి కనిపించాడు. నిందితున్ని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించి వివరాలు సేకరించారు. కారులో 71 కిలోల 620 గ్రాములు గంజాయి గుర్తించారు. ఈ నేరస్తుడు 2018 నుంచి నేరాలకు పాల్పడుతూ పటాన్ చెరువులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళాడు. నెల రోజుల క్రితం గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడితే ఆ క్షణంలో హనుమాన్ నాయక్ సహాయంతో పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. ఇతను ఏ-1 నిందితుడు జైపాల్ , ఎ -3 మల్లికార్జున్ అనే వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. గంజాయిని జైపాల్కి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి నారాయణఖేడ్ వెళ్తుండగా పట్టుపడ్డాడు. పట్టుకున్న గంజాయి ని స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి పట్టుకున్న ఎస్ఐ రాజకుమార్ తదితరులకు రివార్డు కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని డిసిపి తెలిపారు.