Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ చీరలు పంపిణీ
- సబ్ స్టేషన్ ప్రారంభం
- పాత ఆసరా పింఛన్ దారులకు ప్రోసిడింగ్ కార్డుల పంపిణీ
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో 11 మంది లబ్ధిదారులు దళిత బంధు కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి లబ్దిదారులు శాలువా పూలమాలతో సన్మానించారు. అనంతరం నర్సాపూర్‌లో నూతన సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం కౌడిడ్ గ్రామంలో పాత పింఛన్ దారులకు ప్రోసిడింగ్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. నందారం గ్రామంలో పాత పింఛన్ దారులకు ప్రోసిడింగ్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీకోసం జీవిస్తే నీలో నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు, నానుడిని నిజం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల హదయాల్లో గూడుకట్టుకున్నారన్నారు. దళిత బంధువుతో దళితుల జీవితాలలో వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వాలు చాలీచాలని పథకాలు ఇస్తూ దళితుల ఆర్థిక అభివృద్ధికి సహకరించలేదన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే శాశ్వత పరిష్కారంగా 10 లక్షల రూపాయలతో దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. సబ్ స్టేషన్ ప్రారంభించడంతో ఇక్కడి ప్రాంత ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా పోయిందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడపడుచులకు అన్నగా, అండగా భరోసానిచ్చే నాయకుడు అన్నారు. పండుగ పర్వదినంలో ఆడపడుచుల కళ్ళలో ఆనందం నింపాలన్నది కేసీఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పండగ కానుకగా చీరలను, పంపిణీ చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దసరా పండుగ తర్వాత ఇల్లు కూడా పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పటేల్ విజరు కుమార్, జడ్పిటిసి కోట్ల మహిపాల్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు, మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరోత్తం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పకీరప్ప, ఎంపీటీసీ కేశవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మల్లేశం, భగవంతు తదితరులు పాల్గొన్నారు.