Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలి
- పని విధానంతోనే గుర్తింపురావాలి
- సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
- విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
- ఎంపీపీ అనురాధా రమేశ్
- 11మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
నవతెలంగాణ-పెద్దేముల్
సమాజాన్ని తీర్చిదిద్దే ఉద్యోగంలో ఒత్తిడి లేని ఉద్యోగం ఉపాధ్యాయ ఉద్యోగమని ఎంపీపీ అనురాధా రమేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇన్చార్జి విద్యాధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో గురుపూజోత్సవ దినోత్సవాన్ని పురస్క రించుకుని 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపీపీ అనురాధా రమేశ్, జడ్పీటీసీ ధారాసింగ్, పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు రాజశేఖర్, తపస్ మండల శాఖ అధ్యక్షులు రాజేష్, యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు నర్సింలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాములు, శ్రీనివాస్, అక్కమాదేవి, మల్లమ్మలను ఉత్తమ ఉపా ధ్యాయ అవార్డు గ్రహీతలకు శాలువాతో సన్మానించి మెమొంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనురాధ రమేశ్, జడ్పీటీసీ ధారాసింగ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు వృత్తికి న్యాయం చేసే విధంగా విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించారు. ఉద్యోగ రీతిలో పని చేసే విధానం వల్ల సమాజంలో గుర్తింపు రావాలన్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు..
జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లమ్మ, మంబాపూర్ జిల్లా పరిషత్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఇందూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు అనంత్ నరిసింహ, మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, గోపాల్ పూర్ పాఠశాల యూపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు బందేప్ప, రుక్మాపూర్ యూపీఎస్ ఉపాధ్యాయులు శివకుమార్, ఉపాధ్యా యురాలు పుష్పలత, వసంత, మన్సాన్పల్లి ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు గిరిజ, పెద్దేమూల్ సీపీఎస్ ఉపాధ్యాయురాలు సంగీత, హన్మాపూర్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయురాలు అను రాధ, మంబాపూర్ ఎంపీపీఎస్ హరిజన్వాడ ప్రధానోపాధ్యాయులు సుందరయ్య, ఇందుర్ జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం ఉపాధ్యాయురాలు షబా నా అజ్మి, మంబాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయురాలు కవిత,ఇందుర్ ఎంపీపీ ఎస్ పాఠ శాల ఉపాధ్యాయురాలు సుష్మలకు ఉపాధ్యాయ సంఘాలు, ప్రతినిధులు, తోటి ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.