Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ మండలంలోని బిచ్చల్, కౌడిడ్, చల్లాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, కొడంగల్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘం నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లా డుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లుతోందన్నారు. టీిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో కౌడిడ్ మాల వెంకటప్ప, మాల బందెప్ప, రాములు మాల మహేష్, బిచ్చల గ్రామానికి చెందిన నాగేష్ గౌడ్, వెంకటప్ప, శ్రీనివాస్, వెంకటప్ప, ఆంజనే యులు, నర్సింలు, నారాయణ, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ పటేల్ విజరు కుమార్, వైసీపీ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ బీములు, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ నరోత్తం రెడ్డి, మాజీ జడ్పీటీసీ పకీరప్ప, టీఆర్ఎస్ నాయకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.