Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్లల్లో నిమగమైన అధికారులు, ప్రజాప్రతినిధులు
- సమస్యలపై ఏకాగ్రత చూపని సమావేశం
- కాలయాపనతో ముగిసిన సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-మొయినాబాద్
మూడు నెలలకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం 'ఎవరి గోలా వారిదే' అన్న చందంగా సాగింది. గురువారం మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంల్లో ఎంపీపీ నక్షత్రం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి అధి కారులు అలస్యంగా వచ్చారు. పలు సమస్యలపై శ్రద్ధ చూపని ప్రజాప్రతినిధులు గైహజరయ్యారు. హాజరైన సభ్యులు సమస్యలపై ప్రశ్నించడంల్లో పూర్తిగా విఫలమైయ్యారు. అధికారుల నుంచి స్పష్ట ్టమై న సమాధానం రాబట్టలేకపోయారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సమస్యలు విన్నవిస్తుండగా ఎంపీపీ జోక్యం చేసుకుని కూసో..కూసో అంటూ అధికారు లకు లేని ఇబ్బంది ఎంపీపీకి కలుగడంపై సభ్యుల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని సమీక్షల్లో ప్రజాప్రతినిధులు విద్యుత్ సమ స్యలు పరిష్కరించాలని అధికారులు నిలదీశారు. ఏ జెండా పత్రాలు, మౌత్ స్పీకర్లు కొరతతో సభ్యులు వారి సమస్యలు సభల్లో చర్చించలేకపోయారు. తహసీ ల్దార్ సమీక్షిస్తుండగా, హిమాయత్‌నగర్ సర్పంచ్ మంజులా, మండల జనాభాకనుగుణగా మా సేవా కేంద్రాలు లేవని ప్రశ్నించారు. కేతి రేడిపల్లి గ్రామ సర్పంచ్ శోభా, చాకలిగూడ గ్రామం లో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీటీసీ మొర శ్రీనివాస్ ఆక్రమంగా కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడాలని అధికారులను కోరారు. ఎన్కిపల్లిల్లో డంపింగ్ యార్డు సమస్యను తీర్చాలని సర్పంచ్ చందన కోరారు. శ్రీరాంనగర్ గ్రామ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటికల్లో స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు.మండల విద్యాధికారి వెంకటయ్య సమీక్ష నిర్వహిస్తుండగా ఆయా గ్రామాల సర్పం చులు ప్రభుత్వ బడుల సమస్యలపై నిలదీశారు. సమస్యలను పరిష్కరిం చేందుకు విదాధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నడుపు తున్నట్టు సభ్యులు పేర్కొన్నారు. స్కూల్ పేరును శ్రీచైతన్యగా మార్చి అధిక ఫీజులు వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధ నలకు విరుద్ధంగా నడుపు తున్న స్కూల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. సమీ క్షలు జరుగుతుండగా అధికారులు ప్రతినిధులు ఫోన్లో నిమగమై , పక్క వారితో గుసగులాడారు. సమావేశంపై ఏకగ్రతా చూపకుండా అధికారులు వచ్చామా.. పోయామా.. అన్న చందంగా ముగిం చారు. చివరికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హజరై అభివృద్ధి పథకాలపై వివరించి, గ్రామానికి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని హమీ లిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్యా, జడ్పిటీసీ కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ మమతా, తహసీల్దార్ అశోక్ కుమార్, సర్పంచులు మనోజ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, కుమార్, రాంచందర్రత్నం, వినీతా, స్వప్న, శోభా, రవళి, చందన, శ్రీనివాస్, మంజులా, పద్మమ్మ, నవనీతా, జనార్థన్‌రెడ్డి, ఎంపీ టీసీలు అర్జున్, శ్రీనివాస్, రాంరెడ్డి, అంజయ్య, మల్లేష్, రవీందర్‌రెడ్డి, లతా, కో ఆఫ్సన్ సభ్యులు ఆయా శాఖల అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.