Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇర్షాద్
- అటవీ శాఖ కార్యాలయం ఎదుట కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-తాండూరు
రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులపై అటవీ శాఖ అధికారుల వేధింపులు దారుణమని టీఆర్ఎస్ తాండూర్ పట్టణ ఉపాధ్యక్షులు మహ మ్మద్ ఇర్షాద్ అన్నారు. గురువారం పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట తాండూరు కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. అటవీశాఖ అధికారులు తమపై పెత్తనం చెలాయిస్తూ.. ఎప్పుడు పడితే అప్పుడు కార్పెంట ర్ దుకాణాలపై దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొహమ్మద్ ఇర్షాద్ మాట్లాడు తూ.. అటవీ శాఖ అధికారులతో అన్ని అనుమ తులు పొందిన కూడా కార్పెంటర్ కార్మికులపై అధికారులు వేధింపులకు గురి చేయడం మానుకోవాలని అన్నారు. లేనిచో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కార్పెంటర్ కార్మికు లపై దౌర్జన్యాలను నిరసిస్తూ ఫారెస్ట్ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్లు పురేందర్చారి, విష్ణుచారి ఆంజన ేయులు, సంగమేశ్వర్, రహీం ఇస్మాయిల్, ఘాజీపూర్ శ్రీనివాస్, నారాయణ, ఆజం, సత్యం, తదితరులు పాల్గొన్నారు.