Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే టీ. ప్రకాష్‌గౌడ్
నవతెలంగాణ - శంషాబాద్
సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు పెంచడంతో లబ్దిదారులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాజేంద్రన గర్ ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్ అన్నారు. గురువారంపెద్ద షాపుర్, జూకల్, ఘాన్సిమియా గూడ, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్‌గూడ గ్రామాల కు చెందిన 340 లబ్దిదారులకు కొత్త ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ పథకాలతో సీఎం కేసీఆర్ లక్షలాది మంది పేద ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. పింఛన్లు రాని వాళ్లను సొంత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో సీఎం కేసీఆర్ వృద్ధులకు అండగా నిలిచారని అన్నారు. స్వరాష్ట్రంలో సాధించిన తరువాత సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివద్ధి అనే రెండు కార్యక్రమాలను జోడు గుర్రాల లాగా పరిగెత్తి స్తున్నారని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమా లు దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయ న్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి ఈ పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు, వైస్ ఎంపీపీ నీలం మోహన్, సర్పంచులు వట్టెల సతీష్‌కుమార్‌యాదవ్, గుర్రం పద్మావతిఅనం తరెడ్డి, చెక్కల చంద్రశేఖర్ ముదిరాజ్, కామోనిబాయి లక్ష్మయ్య, మంచాల రాణి రవి, కోడూరు నరసమ్మ, దేవిక జగన్‌గౌడ్, ఎంపీటీసీలు చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, గడ్డ మీది యాదగిరి, పూసలపాటి యాదయ్య, బుక్క ప్రవీణ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ బొమ్మ దవనాకర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, బూర్కుంట సతీష్, ఎంపీ డీవో వసంత లక్ష్మి, ఎంపీఓ సు జాత, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.మోహ న్‌రావు, ఉపాధ్యక్షుడు ఆనేగౌని శ్రీకాంత్‌గౌడ్, దుబ్బచర్ల మాధవి, నక్క సాయియాదవ్, దన్నాడ శ్రీకాంత్, మందా ల సుధాకర్ పాల్గొన్నారు.