Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రేమ, అభిమానం కనబరిచేం దుకే చీరల పంపిణీ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమా వేశ మందిరంలో తెలంగాణ ఆడపడు చులకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూ. 340 కోట్లను ఖర్చు చేసి కోటీ పేద కుటుంబాల ఆడపడు చులకు కానుకగా చీరలను అందజేస్తున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి చీరలను అంది స్తామన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు భరోసానిస్తూ.. వారు కూడా ఆర్థికంగా బలపడే దిశగా వారితో చీరలు తయారు చేయించినట్టు తెలిపారు. అందరూ పండుగ సంతోషంగా జరుపుకోవాలన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి. సునీత మహేందర్రెడ్డి మాట్లాడు తూ తెలం గాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఆత్మ గౌరవ ప్రతీక అని అన్నారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా తీసుకురావడం గొప్ప పరిణామం అని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. చీరలకు పంపిణీలో భాగంగా 3 లక్షల 35 వేల చీరలను మూడు గోదాంలలో భద్రపరచినట్టు తెలిపారు. సరఫరా అయిన చీరలను ప్రతి గ్రామాల్లో మహిళలకు సకాలంలో చీరలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, పరిగి శాసనస భ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజరు కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజులరమేష్,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామిరెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, డీఆర్డీఓ కృష్ణన్, జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి, వికారాబాద్ ఆర్డీఓ విజరు కుమారి పాల్గొన్నారు.