Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-మోమిన్‌పేట
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తాగునీరు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.'మీతో- నేను' కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరి ధిలోని అమ్రాది ఖుర్థు గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలో 4,6,7వ వార్డులలో నీటి సమస్య ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు వాటితో పాటు నూతనంగా నిర్మిస్తున్న 25 ఇండ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి, గేట్ వాల్ ఏర్పాటు చేసి, ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా ప్రజలకు నీరందించాలనీ మిషన్ భగీరథ అధికా రులను ఆదేశించారు. గ్రామంలో ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పశువుల డాక్టర్ వచ్చి పశువులకు వైద్య సేవలు అందించాలని పశు వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలోని బావులపై , పై కప్పులు ఏర్పాటు చేసి, పాడు బడ్డ ఇండ్లు, పిచ్చి మొక్కలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో శానిటేషన్ పనులు ప్రతి రోజూ నిర్వహించాలని సూచించారు. ప్రతి వార్డులో ఎప్పటికప్పుడూ చెత్త సేకరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదే శించారు.థర్డ్ వైర్ పూర్తి స్థాయిలో గ్రామం మొత్తం ఏర్పాటు చేయా లని, గ్రామంలో పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, అవసరమైన చోట ఇంటర్ ఫోల్స్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమ స్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు. నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీలలో తాగు నీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశిం చారు. అనంతరం గ్రామ ప్రజలకు మంచి సేవలందిస్తున్నఎఎన్ ఎమ్ విజ య, ఆశా వర్కర్ విజయ లను అభినందిస్తూ వారిని శాలువాతో సన్మా నించారు. ఈ కార్య క్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్, స్థానిక సర్పంచ్ సునీత మల్లేశం, ఉప సర్పంచ్ అయ గ్రామాల సర్పంచ్ లు అంజయ్య, శశిధర్ రెడ్డి, చంద్రకళ, ఎంపీటీసీలు గోవర్ధన్ రెడ్డి, కుశాల్ కుమార్, నాయకులు నర్సిములు, ప్రతాప్ రెడ్డి శేఖర్, లక్ష్మయ్య, అనంతయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంపిఓ యాదగిరి, ఆర్ ఐ రాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.