Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు మర్పల్లితండా రోడ్డు గుంతలు ఏర్పడి బురదమయంగా మారింది. దీంతో తండావాసులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ తరుపున మర్పల్లి ఇందిరమ్మ కాలనీ నుంచి తండా వరకూ ఎర్రమట్టి పోసి చదును చేసినట్టు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సలీం గురువారం తెలిపారు. మర్పల్లి కోట్ మర్పల్లి వెళ్లే రోడ్డులో, కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకుచేరి వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలగడంతో కల్వర్టు పక్కన కూరుకుపోయిన మట్టిని తొలగించినట్టు తెలిపారు. సుమారు 40 ఏండ్ల క్రితం పెద్దవాగుపై నిర్మించిన చిన్న కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరి , పిచ్చి మొక్కలతో నిండి గంటల తర బడి వాహనాలు రాకపోకలు నిలిచి పోతున్నాయన్నారు. వెంటనే దాన్ని తొల గించి కొత్త బ్రిడ్జి నిర్మించాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సలీం అధికారులను కోరారు.