Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గుల
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏరువాక కేంద్రం తాండూర్ వారి ఆధ్వర్యంలో రైతులకు పత్తి సాగు అధిక దిగుబడులపై అవగాహన కల్పించారు. అధిక సాంద్రత మొక్కల పత్తి సాగులో క్షేత్ర సందర్శన చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లిలో రాశి సీడ్స్ వారి హైబ్రిడ్ ఆర్సిహెచ్ 665 రకం పత్తి పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పత్తి సాగు సాధారణ పద్ధతి కన్నా యాంత్రీకరణ ద్వారా అధిక సాంద్రత పద్ధతిలో నాలుగు రెట్లు మొక్కలు ఎక్కువగా ఉండటం వలన ఒక చెట్టుకి 10-12 కాయలు కాసిన ఒక ఎకరానికి 10 క్వింటాళ్ల పైచిలుకు దిగుబడిని పొందవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తి సాగు చేసిన రైతులకు రాశి సీడ్స్ వారు లింగాకర్షణ బుట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్ ప్రవీణ్ సైంటిస్ట్ డిడిఏటిటిసి తాండూర్, డాక్టర్ ఎస్ సుధారాణి సీనియర్ సైంటిస్ట్ ఎలక్ట్రానిక్ వింగ్, మండల వ్యవాయాధికారి కే. గౌతమ్, వ్యవసాయ విస్తరణ అధికారి కే. రాజేష్ నాయక్, రాశి సీడ్స్ హెచ్డిపిఎస్ ప్రతినిధి ఆనంద్, రైతులు పందుల అంజయ్య, జెల్ల చంద్రయ్య, జెల్ల అచ్చయ్య, గూడూరు బక్కయ్య , తదితరులు పాల్గొన్నారు.