Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మండలాధ్యక్షులు తాండ్ర రవీందర్
నవతెలంగాణ-యాచారం
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలని బీజేపీ మండలాధ్యక్షులు తాండ్ర రవీందర్ అన్నారు. గురువారం యాచారం మండల పరిధిలోని బీజేపీ శ్రేణులు పెద్దఅంబర్‌పేటలో జరిగే ప్రజా సంగ్రా మ యాత్ర ముగింపు సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైనట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లవెల్లి సర్పంచ్ డేరంగుల రాజు, మాజీ సర్పంచులు జగదీష్, విజయ్ కుమార్, బిజెపి నాయకులు శ్రీనివాస్ గుప్తా, నడికుడి కృష్ణ, భూతరాజు నాగరాజు నాగరాజు, పల్లపు నరేష్, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.