Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు.మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, హఫీజ్పెట్ డివిజన్ల పరిధిలోని అర్హులైన వేయ్యి మంది లబ్దిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా డీసీ సుధాన్స్, ప్రాజెక్టు ఆఫీసర్ ఉషారాణి, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్‌తో కలిసి పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకం చాలా గొప్పదన్నారు. కుల, మత, రాజకీయ ప్రాంతాల భేదం లేకుండా అరులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో రూ.600లు మాత్రమే పింఛన్లు అందజేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి దిక్సుచిగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎం హెచ్ ఓ కార్తిక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ,గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు,టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, లబ్దిదారులు పాల్గొన్నారు.