Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ తోటిరెడ్డి రాజేందర్రెడ్డి
- సహకార సంఘం సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-యాచారం
రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి సహకరించాలని పీఎసీఎస్ చైర్మెన్ కోటిరెడ్డి రాజేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో ఉన్న సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మెన్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. రుణాలను వసూలు చేయడంలో నియోజకవర్గ పరిధిలోని యాచారం బ్యాంకు ముందంజలో ఉందన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఇచ్చే రుణాలను రైతులంతా సద్వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా బంగారం పైన ఇచ్చే రుణాలు కూడా లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సహకారంతో సహకార సంఘం అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో నాగరాజు, సర్పంచులు శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్లు కొండ మధుకర్ రెడ్డి, కొండాపురం కలమ్మ, మక్కపల్లి స్వరూప, మద్దెల శశికళ, మల్లారెడ్డి, మాధవి, లక్ష్మయ్య, రైతులు, సంఘం సిబ్బంది పాల్గొన్నారు.