Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీసులు అందజేసినా ఆగని నిర్మాణాలు
- అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులు, పంచాయతీ పాలకవర్గం
- ప్రజా ప్రతినిధుల పైరవిలా..
- చేతివాటలా అంటున్న స్థానికులు..
- హైవే పక్కనే నిర్మాణాలు ప్రమాదాలకు స్థావరం
- అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి:స్థానికులు
నవతెలంగాణ-మొయినాబాద్
మండలంలోని కనక మామిడి గ్రామ పంచాయితీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. హై వేరోడ్డు పక్కనే అద్భుత కట్టడాలు నిర్మితమవుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సర్వే నెంబర్ 51/1లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్మాణాలకు అడ్డుచెప్పక పోగా, వారిని ప్రోత్సహిస్తూ జేబులు నింపుకుంటున్నాయనీ స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే అదునుగా భావించి ఆక్రమ నిర్మాణదారులు తమను ఆపేవారే లేనట్టుగా యాథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.సామాన్య ప్రజలు ఇండ్ల నిర్మాణం చేపడితే నిర్మాణాలకు అనుమతులు లేవని, ఆపాలని నోటీసులు అందజేసే కట్టడిగా చేస్తారు. ఆ నిర్మాణాలు ఆపే అధికారులు, పంచాయతీ పాలక వర్గం బడాబాబుల నిర్మాణాలకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తు న్నారనీ గట్టిగా వినిపిస్తున్నా వాదన.ప్రజలను పైఅధికారులను మభ్యపెట్టే విధంగా నిర్మాణ దారులకు నోటీసులు అందజేసి ఆపాలని చెప్పడం, వారు అదే అదునుగా భావించి నిర్మాణాలు స్పీడ్ పెంచడం చకచక జరిగిపోతున్నాయి. ప్రారంభ దశ నుంచి నోటీసులు ఇచ్చామని మభ్యపెట్టే అధికారులు, నిర్మాణాలు చివరి దశకు చేరుకునే సరికైనా నిర్మాణాలు అగకపోవడం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారు. జిల్లా అధికారులు అక్రమ నిర్మాణాలను ఆపాలని ఆదేశాలు జారీ చేసినా, మండల, గ్రామ స్థాయి అధికారులు వాటిని పేడ చెవిన పెట్టి, కాసుల అలవాటు పడి మౌనం పాటిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.హైవె పక్కన జరిపే ఈ నిర్మాణాలు అనేక ప్రమాదాలకు స్థావరాలుగా మారుతున్నాయనీ వీటిని ఆపాలని స్థానికులు పలుమార్లు విన్నవించు కుంటున్న అధికారులు, పంచా యతీ పాలకులకు పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాసుల వేటలో పడిన కొందరు అక్రమ నిర్మాణాలకు ఊతమిస్తూ తమ వంతు చేతివాటం చూపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. వారం రోజుల క్రితం గ్రామ పంచాయతీ అధికారి నిర్మాణాలు ఆపాలని 51/1,506,373 లో నోటీ సులు అందజేశారు. అదే రోజు సాయంత్రం నిర్మాణా దారులు నిర్మాణాలకు అడ్డుగా తెర ఏర్పాటు చేసి మరింత జోరుగా నిర్మాణాలు ఊపందు కున్నా యి.అంటే అధికారులు ఎంత బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారో అర్ధమ వుతుందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యతలు నిర్వహించాలని కోరుతున్నారు.