Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతుల్లేని ఆస్పత్రులకు జరిమానాలు
- నిబంధనలు పాటించని ప్రయివేట్ నర్సింగ్
- హౌమ్, ఆస్పత్రులు క్లినిక్లపై చర్యలు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో తాండూరులో ప్రయివేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో కొన్నసాగుతున్నాయా లేదా అని వివరాలు సేకరిస్తున్నారు. పట్టణ కేంద్రంలోని ప్రయివేట్ ఆస్పత్రులు, క్లినిక్ లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. పట్టణంలో కొనసాగుతున్న 22 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించినట్లు వైద్యుల ప్రత్యేక బృందం అధికారి ధరణి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకౌంట్ లో కొనసాగుతున్న నర్సింగ్ హౌమ్ లు, ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగస్టిక్ సెంటర్ రిజిస్ట్రేషన్ లేకుండా కొనసాగుతున్నాయని ప్రభుత్వం గుర్తించి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2 బృందాలతో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. తాండూరు డివిజన్లో 36 కి రిజిస్ట్రేషన్లు ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ ఉన్న వాటితో పాటు లేని వాటి పైన కూడా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆస్పత్రిలో అర్హత కలిగిన డాక్టర్ లు ఉన్నారా లేదా అన్న విషయాన్ని గుర్తిస్తున్నట్టు తెలిపారు. తాండూర్ నర్సింగ్ హౌమ్ లో స్కానింగ్ సెంటర్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ లేని 11 ఆస్పత్రులకు జరిమానాలు విధించినట్టు తెలిపారు. అనుమతుల్లేని 11 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక బృందం అధికారులు డాక్టర్ రవీందర్ డాక్టర్ పవిత్ర, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.