Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకస్మిక తనిఖీలు చేసున్న వైద్యఆరోగ్య శాఖ
- ఓకే రోజు 30 ఆస్పత్రుల్లో తనిఖీలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు ఆస్పత్రులపై ఆ శాఖ అధికారులు కొరడా జులూపిస్తున్నారు. జిల్లాలో కొందరు అర్హత లేని డాక్టర్లు వైద్యం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో వైద్య శాఖ అప్ర మత్తమైంది. ఆయా ప్రయివేటు ఆస్పత్రులపై దాడులు నిర్వహిస్తున్నారు. సరైన అను మతులు, సక్రమమైన వైద్య పరికరాలు లేని ఆస్పత్రులను జిల్లా వైద్య అధికార బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. సరైన వసతులు, అర్హత లేని డాక్టర్లతో వైద్యం నిర్వహిస్తున్నారని ఇబ్రహీంపట్నంలోని జయ హాస్పిటల్ని చైల్డ్ హెల్త్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అభిరామ్ బృందం సీజ్ చేశారు. అయితే జిల్లా వైద్య అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని ముందస్తు సమాచారంతో సదరు ప్రయివేటు ఆస్పత్రుల యాజమానుల ముందుగానే పలువురు డాక్టర్లు క్లినిక్ లను మూసివేశారు. ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి అనుమతి లేని ఆస్పత్రులపై, అర్హత లేని డాక్టర్లతో వైద్యం నిర్వహిస్తున్న పలు ఆసుపత్రులను సీజ్ చేసి నట్లు డాక్టర్ అభిరామ్ తెలిపారు. వైద్యశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంహెచ్ వి నాగజ్యోతి సారధ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని జయ హాస్పిటల్, సాయి డెంటల్ క్లినిక్, ఆర్ఆర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, చైతన్య ఆయుర్వేదిక్ క్లినిక్, మంచాల మండల పరిధిలోని నోముల గ్రామంలోని తిరుమల క్లినిక్ లను సీజ్ చేసినట్లు వెల్ల డించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ తనిఖీలలో అనుమతులు లేని ఆసుపత్రులపై అదే విధంగా అర్హత లేని వైద్యులు వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఆసుపత్రులను సెజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.