Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
రాజకీయ పార్టీల కతీతంగా చేవెళ్ల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల సర్వసభ్య సమావేశం చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తా మన్నారు. మండలంలో విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యతనివ్వడం జరుగు తుందన్నారు. మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభు త్వం నుంచి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీడీవో రాజ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.