Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస్యోజన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పర్యటనలో కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్ సెంటర్ను కేంద్ర మంత్రి సందర్శించారు.ఈ ఆస్పత్రి పరిశీలించేందుకు విచ్చేసిన కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు, బొగ్గు గనులశాఖ మంత్రి వర్యులు ప్రహ్లాద్ జోషి, చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డిలను, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర కోశా ధికారి రఘునాథ్ యాదవ్, నాగేశ్వర్ గౌడ్, గుండె గణేష్ ముదిరాజ్, రాధాకృష్ణ యాదవ్ కలిసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూప రింటెండెంట్ వరదాచారి, జిల్లా, డివిజన్ నాయకులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.