Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ నిరుపేద కుటుంబం సంతోషంగా పండుగ జరుపుకోవాలి
- వచ్చే రెండేండ్లలో తాండూరు రూపురేఖలు మారుస్తాం
- తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
- బతుకమ్మ చీరెల పంపిణీ
నవతెలంగాణ-తాండూరు రూరల్
మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలు మహిళలకు, లబ్దిదారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ నిరుపేదకుటుంబం సంతోషంగా పండుగను జరుపుకునేందుకు కులమతాలకతీతంగా గత ఐదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు చెరెలు పంపిణీ చేస్తుందన్నారు. తాండూరు మండలం, పట్టణం లోని మొత్తం 29 వేల12 చీరెలు మంజూరైనట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందజేస్తూ, వారికి భరోసానిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. తక్షణమే అల్లాపూర్ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న మురుగు కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజల ఇబ్బందులు తొల గించాలన్నారు. అభివృద్ధి ఒకే సారి జరగదనీ, ముప్పై ఏండ్లలో జరగని అభివృద్ధి, మూడేండ్లలో జరిగిందన్నారు. వచ్చే మరో రెండేండ్లలో తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తామన్నారు. మోకాళ్లలోతు ఉన్న గుంతల రోడ్లకు త్వరతగతిన నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులతో పాటు, సీసీ రోడ్ల డ్రయినేజీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీనినచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ (సుశీల్ కుమార్‌గౌడ్), గ్రామ సర్పంచ్ నందిని, యాదయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ రామలింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రామ్‌దాస్, సూపరింటెండెంట్ జర్నప్ప, ఆర్ఐ రాజీరెడ్డి,పంచాయతీ కార్యదర్శి భవాని, గ్రామ ఉపసర్పంచ్ శ్యామప్ప, వార్డు సభ్యులు శానప్ప, గ్రామ యువకులు కిశోర్ గౌడ్, బీరప్ప రాజుగౌడ్, అంబేద్కర్ యువజన సంఘం యువకులు రోహిత్ అన్న, యువజన సంఘం యువకులు, గ్రామస్తులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.