Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప
నవతెలంగాణ-కొడంగల్
విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయనీ టీఎస్ యూటీఎఫ్ వికారా బాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తుంకిమెట్ల, ఆశ్రమ పాఠశాల, రేగడి మైలారం, బొట్లవోనితండా, కట్టు కాల్వతండా, ఎన్నిమీది తండా, నాగిరెడ్డిపల్లి, కొత్తూరు, వడిచర్ల తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ పాఠశాలల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి మహిళా టీచర్లకు ప్రస్తుతి సెలవులు ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు బాకిపడిన మూడు కరువు భత్యాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు. 317 జీవోకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించి దసరా సెలవుల్లో ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ను ప్రకటించి పూర్తి చేయా లని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసి, విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేటీకరణ వైపు మొగ్గు చూపడం సరికాదన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎస్ యూటీఎఫ్ ఐక్య పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం తగదన్నారు.ఉపాధ్యాయుల్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు గతంలో కనుమరుగయ్యాయనీ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాద్యాయ సంఘాలను చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేయాలని కోరారు. మన ఊరు-మనబడి పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా అదనపు ఉపాధ్యాయుల నియామకం చేయకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం సరికాదన్నారు. సమస్యల పరిష్కా రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లేష్, మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.