Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ- బంట్వారం
నిరుపేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ వై ద్యం అందుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచు కుని సీఎం కేసీిఆర్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తున్నా రని వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్ట ర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో బంట్వారం మండలానికి చెందిన ఐదుగురు లబ్దిదా రులకు మంజూరైన రూ.2 లక్షల 12 వేలు విలువున్న 5 సీఎంఆర్ఎఫ్ చెక్కు లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్య క్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రాంచంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ సుధాకర్‌గౌడ్, మండల అధ్యక్షులు రాములు యాదవ్, రైతుబంధు మండలా ధ్యక్షులు ఖాజా పాషా, పార్టీ ప్రధాన కార్యాదర్షి అల్లాపురం శ్రీనివాస్, సోషల్ మీడియా మండలాధ్యక్షులు అంజిలయ్య, సర్పంచ్‌లు నర్సింలు, బర్కత్‌పల్లి నర్సింలు, నర్సింహా రెడ్డి, గోవింద్ రెడ్డి, నాయకులు చందుసింగ్, మహిపాల్ రెడ్డి, ఖలీమ్పాషా, ప్రవీణ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.