Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ
నవతెలంగాణ-ఫరూఖ్‌నగర్
పాఠశాలలో సౌకర్యాలు, విద్యాబోధన, భోజన వసతి ఎలా ఉన్నాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కస్తూర్బా విద్యార్థినిలను ప్రశ్నించారు. శుక్రవారం ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద కస్తూర్బా బాలికల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా తరగతి గదులను సందర్శించి విద్యార్ధినుల హాజరు శాతం పట్టికను పరిశీలించారు. అనంతరం భోజనశాలను, స్టోర్ గదులను పరిశీలించారు. పాఠశాలలో ఇంకా ఏమై నా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థినులను అడిగి వాటిని త్వరితగా పరిష్కారిస్తామని తెలిపారు. కార్య క్రమంలో జెడ్పి వైస్ ఛైర్మన్ ఈట గణేష్, స్థానిక ఎంపీడీవో వినరు కుమార్, ఎంపీపీ ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.