Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
- రూ.9.27 లక్షల జెడ్పీ నిధులతో సీసీరోడ్డు నిర్మాణం
నవతెలంగాణ-ఆమనగల్
రాజకీయాలకు అతీతంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. మండలంలోని మక్తమాధారం, సాలార్పూర్ తది తర గ్రామాల్లో జెడ్పీ నిధుల నుంచి నిర్మించే సీసీరోడ్డు పనులకు సంబంధించిన ప్రోసిడింగ్ పత్రా లను సర్పంచ్ సులోచన సాయిలు, ఎంపీటీసీ ప్రియా రమేష్ లకు శుక్రవారం తన నివాసంలో జెడ్పీటీసీ జర్పు ల దశరథ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, అంతర్గత మురికి కాలువలు తదితర మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ఆయన పేర్కొ న్నారు. మక్తామా ధారం గ్రామంలో రూ.4.27 లక్షలు, సాలార్పూర్ గ్రామం లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డును నిర్మిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రావిచేడ్ ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్, ఏఎంసీ డైరెక్టర్ లాయఖ్ అలి, ఉప సర్పం చ్లు శారదా పాండు నాయక్, గణేష్, నాయకులు లక్పతి నాయక్, జమీర్, జంగయ్య, రమేష్, శ్రీను, జైపాల్ తది తరులు పాల్గొన్నారు.