Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు నిధులు మంజూరు చేస్తుందని జిల్లా సాంఘీక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్ అన్నారు. మండలంలోని సింగంపల్లి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ ప్రేమలత నర్సింహ, ఎంపీటీసీ సభ్యు లు దోనాదుల కుమార్ తదితరులతో కలిసి మట్టి రోడ్డు మరమ్మతు పనులను జడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సింగంపల్లి గ్రామ పంచాయతీ పాలకమండలి, ప్రజల కోరిక మేరకు జడ్పీటీసీ నిధుల నుంచి రూ.4 లక్షలతో పోలేపల్లి ఎక్స్ రోడ్డు నుంచి సింగంపల్లి మీదుగా ఆకుతోటపల్లి బీటీ రోడ్డు వరకూ మట్టి రోడ్డుకు మరమ్మతులు చేపడ్తున్నట్టు చెప్పా రు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోషాలు, వార్డు సభ్యులు, నాయకులు రాజు, యాదయ్య, స్కైలాబ్, మురళి, రమేష్ నాయక్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.