Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
రాష్ట్రంలో కులవృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని దోమ సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని చిప్పోన్ కుంటలో చేప పిల్లలను స్థానిక ప్రజాప్రతినిధులు, మాత్స్య సంఘం నాయకులతో కలిసి కుంటలోకి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల అభ్యున్న తికీ పాటుపడుతుందని కొనియడారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి ఆధాయభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సీఎం కేసిఆర్ రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. కార్యక్రమంలో దొర్నల్పల్లి సర్పంచ్ యాదయ్య సాగర్, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, రైతుబంధు అధ్యక్షులు లక్ష్మయ్య, మాత్స్య సంఘం నాయ కులు బిచ్చయ్య, అనంతయ్య, నర్సయ్య, స్టార్ వెంకటయ్య, ఇన్స్పెక్టర్ రషీద్, డీవో హనుమంతు, ఎఫ్ఏ తోర్య, ఎఫ్యం సందయ్య, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బస్వా రాజ్, గ్రామస్తులు గౌస్ పాల్గొన్నారు.