Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలశాఖ అధ్యక్షులు శ్రీనివాససాగర్
నవతెలంగాణ-కేశంపేట
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ మండలశాఖ అధ్యక్షులు ఆస్కాని శ్రీనివాససాగర్ అన్నారు. శుక్రవారం కేశంపేట మండలం లోని వివిధ పాఠశాలలో పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కేశంపేట, లేమా మిడి, నిర్దవెళ్ళి, లింగంధన, తొమ్మిదిరేకుల, కాకునూరు, పాపిరెడ్డిగూడ తదితర పాఠశాలల్లో సభ్యత్వాల నమోదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్సాగర్ మాట్లాడుతూ పెండింగులో ఉన్న కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు.ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూ ల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు గ్రహీత జగదీశ్వర్ రెడ్డిని శాలువా పూలమాలతో సన్మానించారు. కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి కర్ణాకర్ గౌడ్, అబ్దుల్బారి, సంతోష్ బాబు, నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.