Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ నవ్యా నర్సింహా రెడ్డి
నవతెలంగాణ-పూడూర్
గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని స్థానిక సర్పంచ్ పీ నవ్య నర్సింహా రెడ్డి అన్నారు. శుక్రవారం పూ డూర్ మండల కేంద్రం లోని చిన్నా బండతండా గ్రమంలో పోషక ఆహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ గర్భిణులు పౌష్టిక ఆహారం తీసు కోవాలన్నారు. పండ్లు కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జామ సీతాఫలం సీజన్లో తప్పనిసరిగా గర్భిణులు తీసుకోవాలన్నారు. తల్లి కడుపులో ఉన్న పాప ఎదుగుదలకు పౌష్టిక ఆహారం ఎంతో అవసరమన్నారు. పుట్టిన చిన్నారులకు తల్లిపాలు తప్పనిసరిగా పాటించాల న్నారు. వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నా రు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ నరసమ్మ, అం గన్వాడీలు అండాలు, పుష్ప తులసి సుజాత, ఏఎన్ఎం భీమమ్మ, ఆశా వర్కర్లు ఉమాదేవి, అమృత మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.