Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన్నేగూడ ఎంపీటీసీ మస్రద్ అదిల్
నవతెలంగాణ-పూడూర్
పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మన్నె గూడ ఎంపీటీసీ మస్రద్ అదిల్ అన్నారు. శుక్రవా రం ఆయన మన్నెగూడ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పీఎం కిసాన్ డబ్బులురాని రైతులందరూ ఆధార్ కార్డుతో ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఇప్పటివరకూ 11 విడతగా ప్రతి రైతుకూ రూ.2 వేలు జమఅయ్యాయని ఇప్పటివరకూ తమ ఖాతాల్లోకి డబ్బులు జమకానీ రైతులు అందుబాటులోని మీ సేవా కేంద్రాన్ని సందర్శిం చి ఆధార్ కార్డుకు లింకు చేసుకోవాలన్నారు. గ్రామంలో యువకులు ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి ప్రతి రైతుకూ పీఎం కిసాన్ అందేవిధంగా కృషి చేయాలని కోరారు.