Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మండలాధ్యక్షులు చీరాల రమేశ్
నవతెలంగాణ-మంచాల
పోల్కంపల్లి గ్రామ కాంట్రాక్టర్ దానయ్య బ్లాక్ మెయిల్ దందా మానుకోవాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షులు చీరాల రమేశ్ అన్నారు.శుక్ర వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.40 లక్షలతో పూర్తి అయ్యే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయకుండా దానయ్య రూ.30 లక్షలు తీసుకుని కూడా బిల్లు రాలేదనీ, ఎమ్మెల్యే ఆపారని అసత్య ఆరోపణలు చేస్తూ, బ్లాక్ మెయిల్ చేయడం సరైన పద్ధతి కాద న్నారు. ఈ విషయంపై కనీసం అవగాహన లేకుండా వార్తలు రాయడం సరైంది కాదన్నారు. ఇలా అవాస్తవాలు రాసి పత్రికలు విలేకరులు తమ గౌరవాలను తగ్గించుకోవద్దని కోరారు. ఇప్పటికైనా ఆవాస్తావాలు రాయడం మానుకో వాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏర్పుల చంద్రయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ దండేటికార్ రవి, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్ష,కార్యదర్శులు వనపర్తి బద్రీనాథ్ గుప్త, గంట విజరు,నాయకులు ఎండీ జానీపాషా,ఆవుల ప్రశాంత్ యాదవ్ తదితరులున్నారు.