Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం మండల కార్యదర్శి మస్కు అరుణ
- తాడిపర్తిలో ఐద్వా గ్రామ కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-యాచారం
రక్షిత కౌలుదారు భూ పోరాటానికి ఐద్వా మద్దతు ఉంటుందని సం ఘం మండల కార్యదర్శి మస్కు అరుణ అన్నారు. శుక్రవారం యాచారం మండల పరిధిలో తాడిపర్తిలో ఐద్వా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తరతరాలుగా నాలుగు గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నా భూమికి రక్షిత కౌల్దారు చట్టం కింద పట్టాలివ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో రైతుల పోరాటానికి ఐద్వా మద్దతు ఉంటుం దని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాణ్యత లేదని ఆరోపించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మహిళలందరికీ బతు కమ్మ చీరలు ఇచ్చే విధంగా చూడాలన్నారు. పొదుపు చేసుకున్న మహిళ లకు అభయహస్తం డబ్బులు ప్రభుత్వం నేటికి అందించడం లేదని విమ ర్శించారు. 57 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చిలుకలా పద్మ, అనిత, సుశీల, రాములమ్మ, భాగ్యమ్మ, జ్యోతి, నరసమ్మ, డి రాములమ్మ, సత్తమ్మ, యాదమ్మ, సుజాత, పార్వతమ్మ, బుగ్గమ్మ, సత్యమ్మ, పార్వతమ్మ కమిటీ సభ్యులుగా ఉన్నారు.