Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొత్తూరు
మండలంలోని మల్లాపూర్ తండా గ్రామ పంచాయతీకి చెందిన కిషన్ (32) మహబూబ్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్పెక్ట్ట ర్, కానిస్టేబుల్ చందు కలిసి మీపై కేసు నమో దైందని పోలీస్ స్టేషన్‌కు రావలసిందిగా వేధిం చడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని హుటాహుటిన షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామానికి చెందిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ తండా గ్రామానికి చెందిన కిషన్ మహబూబ్‌నగర్‌కు చెందిన లలితతో 5 ఏండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. కూలినాలి చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నడు. కొంతకాలంగా వారి ఇరువురి మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవపడ్డారు. దీంతో భార్య లలిత 6 నెలల క్రితం అమ్మగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. భర్త కిషన్‌పై స్థానిక మహబూబ్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిం దని కానిస్టేబుల్ చందు శనివారం మల్లాపూర్ తండాకు చేరుకుని కిషన్ పోలీస్ స్టేషన్ రావాల్సిం దిగా ఒత్తిడి చేశారు. దీంతో స్థానిక నాయకులు కలగజేసుకుని భార్యా భర్తలను కూర్చోబెట్టి మేము మాటా డి నచ్చచెప్తాం మీరు వెళ్ళండి అం టూ పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సిఐ హనుమాన్ నాయక్‌తో ఫోన్లో మాట్లాడి బతి మిలాడిన మా ట వినకుండా దురుసుగా మాట్లాడారని పేర్కొన్నారు. దీం తో మల్లాపూర్ తండా గ్రామస్తులు శనివారం స్థానిక కొత్తూరు పోలీస్ స్టేషన్లో మహబూబ్‌నగర్ సిఐ హనుమాన్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా జిల్లా ఎస్పీకి సైతం అతనిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.