Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి
- కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో కులాలు, మతాల పేరుతో విభజించి పాలించాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, దీనికి కర్నాకట ఫలితాలే నిదర్శమని, ఈ ఫలితాల్లో దేశ రాజకీయాల్లో పెను మార్పు రాబోతుందని కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలపొంద డంతో పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శని వారం సంబురాలు చేసుకున్నారు. టాపాసులు కాల్చి, సీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ సామాన్యులు మోయలేని విధంగా నిత్యావ సరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ సరైన సమయం లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన కర్నాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో మార్పు వస్తుందన్నారు. కులాలలు, మతాలకు భిన్నంగా అందరినీ కలుపుకొని పొతున్నట్టు తెలిపారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడే అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.