Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన నిశిత దృష్టితో సమాజంలోని లోపాలనే కవితాస్త్రాలుగా, సమాజ చైతన్యమే ధ్యేయంగా, అక్షరాలే ఆయుధాలుగా అక్షర యజ్ఞం చేస్తూ తన కలంతో సంధించినది ఈ అక్షరాస్త్రం. తన అభ్యుదయ భావాలతో, సమాజ హితాన్ని కోరుతూ, సామాజిక స్పహ కలిగి సమాజాన్ని చైతన్య పరుస్తూ రాసిన కవితల సమాహారం అక్షరాస్త్రం.
అక్షరాస్త్రం కవితాసంపుటిలో
విశ్వాది శక్తి అమ్మ అంటూ అమ్మకు అగ్రతాంబూలం ఇచ్చాడు. పురిటి నొప్పులు భరించిపసి పాపలకు ప్రాణం నిలిపి అమతం వంటి ప్రేమను పంచేది అమ్మ అని అమ్మను కీర్తించాడు.
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అని, ఆత్మీయతకు, పైరు పంటలకు పుట్టినిల్లు అని,
కలగలుపు కలిగెను / పల్లె కుటీరవములు/ పైరు పంటలతో మురిసెను/ పశు సంపదలు అంటూ పల్లె సోయగాన్ని కళ్లకు కట్టినట్లు లిఖించాడు.
'ప్రజాస్వామ్యాన్ని రక్షించే/ ప్రజా ఆయుధం ఓటు' అంటూ ఓటు యొక్క విలువను చక్కగా తెలిపారు.
'ఇంటికి పెద్ద గడపలువద్ధులు / వయసు చేత వద్ధులు / అనుభవంలో మహర్షులు' అంటూ వారి యొక్క ప్రాధాన్యతను అద్భుతంగా చెప్పారు.
'అన్యాయం అంతరిస్తే / నా గొడవకు ముక్తి ప్రాప్తి' అన్న కాళోజీ మాటలను ఆయన సాహిత్య సేవలను కవితలో చక్కగా వర్ణించారు. రైతు దేశానికి వెన్నముక అతడు అలిగితే లేదు మనకు అన్నమిక అంటూ రైతు యొక్క గొప్పతనం తెలిపిన రైతు బిడ్డ.
కులం ఇంటి గడప వద్ద / మతం పూజ గది వద్ద ఆగాలని /సమాజంలో మానవత్వమే మతంగా/ ఐక్యమత్యమే కులంగా వెల్లివిరియాలని కులంతర సవ్వడి కవితను సంధించాడు.
చివరగా నాన్న కనిపించే దైవం అని 'కుటుంబం సుఖం కోసం / చేసేను త్యాగం' అని నాన్నకు గౌరవం ఇచ్చారు.
ఈ విధంగా తన యొక్క అక్షరాస్త్రం కవితా సంపుటితో సమాజాన్ని చైతన్య పరుస్తూ, అక్షర యజ్ఞం చేస్తున్న అక్షర ప్రేమికుడు డా.తెలుగు తిరుమలేష్.
- అమీర్ భాష,
9642480702