Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాలలో అణిచివేయడిన గోజాతి ప్రజాస్వామ్యంలో అదే పరిస్థితి కొనసాగుతుంది. దేశంలో గోర్ అని పిలువ బడు ఈ జాతి హరప్ప మోహన్ జాధారో సింధు నది 'గోర్ అనే ప్రాంతం' నుండి ఉన్న నదుల పరివాహక ప్రాంతాలకు విస్తరించి ఉన్నారు. వీరు అప్పటి రాజ్యాలలో భాగస్వాములైనారు. సింధు నాగరికత 8వేల సంవత్సరాల క్రితం నుండి సంస్కతి సాంప్రదాయాలు నేటికి కొనసాగిస్తూ వస్తున్నారు. గోర్ తెగపై ఇతర మతాల దాడులు నిత్యకత్యం అయినాయి. దేశంలో దాదాపు 13 కోట్ల జనాభా కలిగి వివిధ రాష్ట్రాలలో దాదాపు 40 పేర్లతో పిలువబడుతూ గుర్తింపు అంటూ లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ నేటికి ఒకే భాష, ఒకే వేషధారణ, ఒకే పండుగలు సంస్కృతి-సాంప్రదాయాలు కలిగియున్నప్పటికీ కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారు.
గోర్ బంజారా దేశవాసులని రాజ్‌పుత్, సూర్య చంద్ర రాజుల వంశానికి చెందిన వారని, హర్షవర్ధనుని అనంతరం రాజపుత్ర వంశం ప్రభావం ఎక్కుగా ఉన్నదని సి.వి. గౌరిశంకర్ మొదలైన చరిత్రకారులు విన్సెంటర్ స్మిత్ రాజపుత్రుల సంతతి స్వదేశం వారు అని కూడ అంటున్నారు. చౌహాన్, పమార్ రాథోడ్‌లు ప్రసిద్ధి చెందిన రాజ వంశీయులని సి.వి. వైద్య, జి.పి.ఓఝా అను చరిత్ర కారులు కర్నల్ లాడ్ బలపరిచారు. హరప్ప మోహన్ జోదారో పాకిస్థాన్ సింధు నదికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ''గోర్ అనే ప్రాంతం''. అక్కడి నుండి పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, మహరాష్ట్ర తెలంగాణ దేశమంత నదులను ఆసరాగా చేసుకుని విస్తరించారు. ప్రధానంగా మాతస్వామిక వ్యవస్థ వీరిలో కనబుడుతుంది. సింధు నాగరికత, ఆచారాలు ఈ జాతి జీవనంలో ఇప్పటికీ కొనసాగుతోంది. మంచినీళ్ళ బావి వ్యవసాయం, పశుపోషణ, మట్టి పాత్రలు స్త్రీలు అలంకరించే గవ్వలు, హరాలు, బంగారం, వెండి, రాగి ఇత్తడిలతో తయారు చేసిన అభరణాలు మూడు జుట్లు అల్లిక, అద్దాలతో అలంకరణ, దంతాలతో దువ్వెనలు ఇప్పటికి వాడుతున్నారు. కంచు వారికి ప్రత్యేక లోహం. ఈ జాతి స్త్రీలు గుణవంతులు, గొప్ప ధైర్యము గలవారని చరిత్ర చెపుతుంది. గుడులు, గోపురాలు వీరి ఆచరణలో కనబడవు. యాగాలు యజ్ఞలు చేస్తూ స్వస్తిక్ గుర్తును ఇప్పటికి వారు పూజలు చేసే సమయంలో వాడుతున్నారు. హరప్ప మోహన్ జోదారో నుండి గోర్ జాతి తమ సంస్కతిని కొనసాగిస్తూ వస్తున్నారు.
క్రీ.శ. 851 అరబ్బు యాత్రికుడు సులేమన్ వీరబోజుని రాజ్యాన్ని దర్శించి బోజుని రాజ్యం సంపన్నంగా ఉందని దొంగలులేరని కొనియాడారు. అప్పటికీ చౌహనులు ప్రాంతీయ సామంతులుగా రాజ్యంలో ఉన్నారు. క్రీ.శ. 956లో సింహరాజ్ చౌహన్ స్వతంత్య్ర రాజ్యం పాలిస్తున్నప్పుడు జయరాజ్ ఘడ్ పట్టణాన్ని నిర్మించెను. జయరాజ్ ఢిల్లీ రాజ్యాన్ని ఆక్రమించెను. క్రీ.శ. 1010 నుండి క్రీ.శ. 1055 రాజబోజ రాజు చక్రవర్తి సామంత రాజులుగా కొద్ది రాజ్యాలను ఎలినారు. పాలన వ్యవస్థ శిస్తు మీద ఆధారపడి గ్రామాల ద్వారానే సిస్తు వసూలు చేసేది అదే బాధ్యతలో గ్రామాలలో జరుగు అభివద్ధి, తగాదాలు, వివాదాలు పంచాయితీ ద్వారానే పరిష్కరించుకునేవారు. ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది.
క్రీ.శ. 1166 గుజరాత్లో పధ్విరాజ్ చౌహన్ తండ్రి సోమేశ్వర్ చౌహన్, తల్లి కర్పురదేవి దంపతులకు జన్మిం చారు. 16 సంవత్సరాలకే పధ్విరాజ్ చౌహన్ ఢిల్లీ రాజ్యానికి రాజు అయ్యాడు. జయచంద్ర రాథోడ్ కుమార్తె సంయుక్తను వివాహం చేసుకున్నాడు. దీంతో ద్వేషం పెంచుకున్న జయచంద్ర రాథోడ్ కుట్ర పన్ని మహమ్మద్ ఘోరీకి పృధ్విరాజ్ రహస్యాలను చేరవేసి, ఇబ్బందులకు గురి చేశాడు. రాథోడ్ వంశానికి చెందిన లక్ష్మణసేనుడు బెంగాల్లో ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. అతనిని పధ్విరాజ్ చౌహన్ ఓడించెను. 1191లో మహ్మద్ ఘోరిని ఓడించి విజయం సాధించెను. 1192 తరాయెన్ యుద్ధంలో విజయం సాధించిన పృధ్వీని ఘోరీ క్షమాపణ కోరగా, క్షమించి వదిలేశాడు. తరువాత దొంగదెబ్బతో 1192లో పధ్విరాజ్ను తురికిస్థాన్లో కారాగారంలో కండ్లు పీకేసి బంధించి ఉంచుతాడు. జరిగిన విపత్తుకు చింతించిన ఆస్థాన పండితుడు చంద్ బర్దారు పధ్విరాజ్ను చూడాలని తలంచి ఘోరిని అనుమతి కోరుతాడు. బర్దారు అడుగుల చప్పుడు విన్న పధ్విరాజ్ కాళ్లు చేతులు జాడించగానే సంకెళ్లు తెగిపడిపోతాయి. ఘోరికి అది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ విషయం బర్దారును ప్రశ్నించగా.. కొంత దూరంలో ఒక గంట కట్టించమని కోరతాడు. అందుకు సమ్మతించిన ఘోరీ తన మంత్రులతో కలిసి సభ ఏర్పాటు చేసి, పృధ్విరాజ్‌ను చెరసాల నుండి తీసుకువచ్చి 50 గజాల దూరంలో ఐదు అడుగుల ఎత్తులో ఒక గంట కట్టిస్తాడు. వస్తున్న శబ్దం ఆధారంగా పృధ్విరాజ్ గంటను ఛేదిస్తాడు. పృధ్విని ఘోరీ శెభాష్ అని మెచ్చుకుంటాడు. ఆ కంఠ ధ్వని ద్వారా ఘోరికి బాణం వేస్తాడు. కంఠంలో బాణం దిగగానే ఘోరీ సింహాసనం మీద నుండి కిందపడి పోతాడు. ఇక పృధ్వి తనకు మరణ శిక్ష తప్పదని గ్రహించి చాంద్ బార్డారునే తనను చంపేయమని కోరతాడు. అతను అలాగే చేస్తాడు. అందుకే చాంద్ బర్దారు పధ్విరాజ్ చౌహన్ పేరు క్షిపణికి పెట్టి ప్రయోగిస్తున్నారు. 1206 మార్చి 15న అజ్మీర్‌లో వీర మరణం పొందెను. పేషావర్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటకీ సమాధి దర్శనమిస్తున్నది.
మహ్మద్ ఘోరి సైన్యములు గోర్జాతిపై దాడి చేసి మారణహోమం సష్టించారు. అడవులు, గుట్టలు, గహలలో తల దాచుకున్న వారిని సైతం వదలకుండా వెతుకు తుండటంతో వారు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగించారు. పెండ్లిండ్లు రాత్రి వేళల్లో చేసుకునేవారు. రాత్రిపూటలల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వారి వేషధారణ పూర్తిగా మార్చుకున్నారు. స్త్రీల వస్త్రాలంకరణలో సైతం మార్పు వచ్చింది. ముఖాలపై పచ్చబొట్లు పెట్టుకున్నారు. మనుషుల పేర్లు చెట్ల పేర్లు కలిసి వచ్చేటట్లు పెట్టుకున్నారు. నది పరివాహక ప్రాంతంలో అడవే ఆధారంగా జీవించసాగారు. ఆకులు, పండ్లు, గడ్డలు, వెదురు బియ్యం, పశువులు, మేకలు పెంచుకుంటూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగించారు.
వీరు ఉత్తర భారతదేశంలో లక్కిషా బంజార, దక్షిణ భారతదేశంలో జంగిభంగీ, మధ్య భారతదేశంలో భగవాన్ దాస్ వ్యాపారులుగా చలమణి అవుతున్నారు. 1608లో బ్రిటీష్ వాళ్ళు వ్యాపారం పేరుతో దేశంలోకి వచ్చారు. అప్పటికీ ఔరంగ జేబు పాలన కొనసాగిస్తున్న కాలంలో లక్కిషా బంజారా వారు పశువుల మేపుకుంటు యమునా నది పరివాహక ప్రాంతంలో ఉంటూ మంచినీటి చెరువుల నిర్మాణం చేశారు. పశువులపైన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఉత్తరాఖండ్, బుందెల్ ఖండ్ ప్రాంతంలో గిరిజనులు, వనమూలికలు, ఉప్పు, సున్నం, ధాన్యాలు తదితర సరుకుల వ్యాపారం బాగా సాగుతున్నది. గోర్ జాతి పైన 1857లో మీరట్‌లో కుట్ర కేసు నమోదైంది. బ్రిటీష్ ప్రభుత్వం వారిని అణదొక్కజూసింది. వ్యతిరేక ఉద్యమంలో లంబాడీలు ఎక్కువ మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొంత మేర భూములు కోల్పోయారు. మిగిలిన భూములను సైతం బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకునే కుట్రపన్నారు. 1839లో వీరిపైన దొంగలు, దారిదోపిడిదారులని ముద్ర వేశారు. అంతటితో ఆగక కరపత్రాలు, పుస్తకాలు వేసి పంచారు. 1871లో వారిని దొంగలుగా చట్టం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఉన్న లక్కీష బంజారను వ్యాపారం చేయవద్దని బెదిరించారు. ఆయన నివాసాన్ని తగలబెట్టారు. ఆయనను నాలుగు ముక్కలుగా నరికి ఢిల్లీ నలుమూలల వేలాడదీశారు. వాటికి లావూరి గేటు, అజ్మిరి గేట్, కాశ్మిరి గేట్, ఢిల్లీ గేట్ పేర్లను నామకరణం చేశారు. దీనితో గోర్ జాతి వ్యాపారం వల్ల వచ్చే 27 శాతం ఉన్న ఆదాయం, 3 శాతానికి పడిపోయింది. చివరకు ఆకలితో అలమటిస్తూ చనిపోయారు.
గోర్ జాతి బిడ్డ 1739న సేవాలాల్ మహరాజ్ పుట్టారు. ఆయన వీరి అభివృద్ధికి మరో ప్రయత్నం చేసాడు. కుంటుపడిన వ్యాపారాన్ని నిలబెట్టేందుకు బంజారాల దగ్గర ఉన్న పశువులు గోర్లు, మేకలతో జాతి మనుగడ సాగాలంటే ప్రకతిని ప్రేమించాలని హితబోద చేశాడు. జంతు బలి ఇవ్వవద్దని ఉపదేశించాడు. చిన్న పెద్ద తేడా లేకుండ ఉండాలని అందరిని గౌరవించడం నేర్చుకోవాలని సూచించాడు. ప్రకతి అభివద్ధిలో భాగంగా తండా నిర్మాణం చేయాలని పిలుపు ఇచ్చాడు. గోర్ జాతి ప్రత్యేకమైనది ప్రతేకంగా జీవించాలని నాయక్, కంరోబారి, డావో, నసాభి, తండ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలని ఆదేశించాడు. దేవుళ్ళు దయ్యాలని నమ్మకండి ''భజోమత్ పూజోమత్ ధూజోమత్'' అంటూ ప్రచారం చేశాడు. తాతముత్తాతల నుండి ''థడో'' పూజించే సాంప్రదాయం ఉన్నది. పోరియఘడ్, లోకమసంద్, సేవాఘడ్ మాతసాద్ బుడియ బాపు జ్ఞానుల పేరులో నిర్మాణంచే ఘట్ థడో మంచి సూక్తులను బోధించిన వారిని మరచిపోకుండా ప్రత్యేక జాతర నిర్వహిస్తుంటారు.
నవాబ్ రాజ్యంలో భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ అంతా ఉద్యమాలు నడుస్తున్న కాలం. భూస్వాములు, జమిందారులు చెప్పిందే వేదంగా అత్యాచారాలు దాడులు చేస్తూ చేతికొచ్చిన పంటలను తీసుకుపోవడం, శిస్తు కట్టడం పుల్లెర కట్టడాలని దోపిడీలు నడుస్తున్న ఆ కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నది. ఈ అదే సమయంలో కులం లేదు, మతం లేదు అందరం స్వేచ్ఛకోసం నైజాం భూస్వాముల ఆగడాలను అడ్డుకోవడం కోసం పోరాటమే మార్గమని కా|| జటోత్ ఠాను నాయక్ ఆరుగురు అన్నదమ్ములు ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఐదుసార్లు ఫైరింగ్‌లలో పాల్గొని ఎనిమిది సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. దళంలో చేరి విప్లవం వర్ధిల్లాలి, సమాజం మారాలి అంటూ ఎర్రజెండ వర్ధిల్లాలి. సమాన రాజ్యం కోసం దళసభ్యుడై చివరకు నిజాం రజాకారుల చేత చిక్కి చిత్ర హింసలకు గురై చనిపోయాడు. పది లక్షల ఎకరాల భూమి పంచి మూడు వేల గ్రామాలకు స్వరాజ్యం తీసుకొచ్చారు. నాలుగు వేల మంది బలిదానం చేసిన మహత్తరమయైన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అటువంటి త్యాగాలు చేసిన ''గోర్ జాతి'' దేశంలో అనేక రకాలుగా అణగ దొక్కబడి తమకు కావాల్సిన హక్కులు అందక నేటికి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నాటి పోరాట ఫలితంగా సంక్షేమ పథకాలు అమలు అయినా, నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలను ప్రయివేటు పరంచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉపాధి, సంక్షేమ ఫలాలను దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. రిజర్వేషన్లు అందకుండా ఉపాధి అవకాశాలు లేకుండా ఇచ్చిన హామీలు అమలు కాకుండా కుట్ర చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజలను భూముల నుండి దూరం చేసే కుట్ర సాగుతున్నది. రైతు వ్యతిరేక చట్టాలకు ప్రపంచ ప్రజలంతా మద్దతు తెలుపుతున్నరు. అదేస్పూర్తితో ప్రజలు పోరాటం చేసి విజయం సాధించుకోవాల్సిన బాధ్యత ప్రజానీకంపై ఉన్నది. ''గోర్ జాతి''కి తమ హక్కులు వచ్చేవరకు దేశంలో ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. గోర్ జాతిని 8 వ షెడ్యూల్డ్‌లో చేర్చి లిపి, కనుగొని దేశంలో ఉన్న భాషను రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఆయా రాష్ట్రాలలో వారి జీవన విధానాన్ని రక్షించి, ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా తీసుకు రావాల్సి ఉంది. ఇందుకు చర్యలు తీసుకోవాలని, ప్రణాళికలు రూపొందించాలని అడుగుదాం.. సాధించుకుందాం...
- ఎం.ధర్మానాయక్, 9490098685
రాష్ట్ర అధ్యక్షులు, గిరిజన సంఘం