Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ రోజు క్లాస్ అంతా సందడిగా వుంది. రెండో పీరియడ్‌కు తెలుగు మాస్టర్ వచ్చారు.
''గోపీ ఎక్కడున్నావ్'' అని ప్రశ్నించారు.
''వెనుకాల బెంచీలో వున్నాను సార్''అన్నాడు గోపీ.
''ఏం ఎందుకని అక్కడ వున్నావు'' మళ్ళీ అడిగారు మాస్టారు.
''మరేం లేదు సార్'' అన్నాడు గోపీ.
''అసలు విషయం ఏమిటో నాకు చెప్పు పర్వాలేదు'' అన్నారు మాస్టారు.
''మరేమీ లేదు సార్ ఇక్కడున్న వారంతా గొప్ప గొప్ప ఫ్యామిలీకి చెందిన వారంట. నేనేమో పేదవాడిని కదా పైగా నాకు బట్టలు కూడా సరిగ్గా లేవు. పైగా నేను ఒక నిరుపేద కుటుంబంనకు చెందిన వాడిని నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ అని నేను ఈ లాస్ట్ బెంచీలోనే కూర్చున్నాను సార్'' అని చెప్పాడు గోపీ.. బాధతో.
''ఒరే గోపీ నీకు కొత్త బట్టలు నేను కొనిస్తాను. చదువులో నువ్వే ఫస్ట్. ఇక నుంచి నువ్వు కూడా మొదటి బెంచీలో కూర్చో''... అన్నారు మాస్టారు.
మాస్టర్ ఇచ్చిన ప్రోత్సాహం గోపీకి కొండంత బలం నిచ్చింది. ''అయినా నేను ఈ వెనుక బెంచీలోనే కూర్చుంటాను. బాగా అలవాటు అయింది. సార్ ఇక్కడే బాగుంది. చదువు శ్రద్ధగా నేర్చుకోవాలి గానీ ఎక్కడ కూర్చుంటే ఏమిటి సార్'' అంటూ గోపీ తన చదువుతాను శ్రద్ధగా చదువుకోసాగాడు. కొద్దిరోజుల తరువాత పరీక్షలు వచ్చాయి. అందరూ రాసారు. ఫలితాలు మాత్రం తారుమారు అయ్యాయి. ముందు బెంచిలో కూర్చున్నవారు అందరూ ఫెయిల్ అయ్యారు. వెనుక బెంచిలో వున్న గోపీ జిల్లా ఫస్ట్ వచ్చాడు. మిగతా విద్యార్థులు సిగ్గుతో తల వొంచుకున్నారు.
చూసారా ఇప్పటికైనా గ్రహించండి. మీరు ముందు బెంచీలో కూర్చున్నామని విర్ర వీగారు. కానీ చదువు మాత్రం సున్నా. మనం చదువు కోవడం ముఖ్యం కానీ ఎక్కడ కూర్చొన్నామన్నది ముఖ్యం కాదు. ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరికైనా కషి, దీక్ష, పట్టుదల ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం అన్నారు మాస్టారు.
ఇది విన్న మిగతా విద్యార్థులు అందరూ కలిసి ''మాస్టారూ మమ్మల్ని క్షమించండి. ఇక మీదట మీరు చెప్పిన మాట వింటాము. కష్టపడి చదువుకుంటాం'' అన్నారు ముక్త కంఠంతో.. గోపీ పట్టుదలను అందరూ ప్రశంసించారు.
- ఎల్. ప్రఫుల్ల చంద్ర, 6300546700